జ్యోతిష్యం :   మీరాశిని బట్టి కెరీర్ ను ఎంచుకోండి..ఎవరు ఏ  రంగంలో రాణిస్తారో తెలుసా.. 

జ్యోతిష్యం :   మీరాశిని బట్టి కెరీర్ ను ఎంచుకోండి..ఎవరు ఏ  రంగంలో రాణిస్తారో తెలుసా.. 

మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునే శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుంది.కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అందుకే ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్నవాళ్లకు జ్యోతిష్యనిపుణులు సూచిస్తున్న పరిష్కార మార్గాల గురించితెలుసుకుందాం...! 

లైఫ్ లో సక్సెస్ అవ్వాలని, మంచి కెరీర్ ఎంచుకోవాలని, ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ......కెరీర్ ఛాయిస్ లో వేసే తప్పటడుగులే వాళ్ల ఫెయిల్యూర్ కి కారణమవుతుంటాయి. కొంతమంది వాళ్లు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు. అయితే టాలెంట్ ని..మీ చదువుని, మీరు చేసిన డిగ్రీని, ఆర్థిక స్థోమతను బట్టి ఎంచుకుంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా, అదే ప్రొఫెషన్ లో వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్లు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు.

మేషరాశి : ఈ రాశి వారు తెలివితేటలతోపాటు .. పట్టుదల కలిగి ఉంటారు. ఇలాంటి వారు ఛాలెంజింగ్​  టార్గెట్స్​ ఉండే జాబ్స్ అంటే ఇష్టపడతారు.  ఈ రాశి వారు ఎక్కువుగా ఆర్మీ.. రాజకీయాలు.. రెస్య్కూ, లీడర్​ షిప్​, వ్యాపారం  వంటి రంగాలతో పాటు.. పారిశ్రామిక వేత్తలుగా సక్సెస్​ సాధిస్తారని జ్యోతిష్య  నిపుణులు చెబుతున్నారు. 

వృషభ రాశి:  ఈ రాశి వారికి కష్టపడే మనస్తత్వం ఉంటుంది.   చాలా లగ్జరీ లైఫ్​ కావాలని కోరుకుంటారు.  డిజైన్​ రంగంలో.. చెఫ్​ గా.. హోటళ్ల వ్యాపారంలో..కంప్యూటర్​ గ్రాఫిక్స్​.. ఫైనాన్స్​ కు సంబంధించిన జాబ్స్​, వ్యవసాయం, రియల్​ ఎస్టేట్​, ఇంజనీరు,  క్రియేటివ్​ రంగాల్లో రాణించే అవకాశాలున్నాయి. 

మిథునరాశి:  ఈ రాశి వారికి ఇతరులను ఆకట్టుకొనే స్వభావం ఎక్కువుగా ఉంటుంది.  వీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.  ఎవరు ఏమన్నా పట్టించుకోరు.. కాని అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉంటూనే..స్నేహ పూర్వకంగా ఉంటారు. ఈ రాశి వారికి ముందు చూపుతో పాటు.. తెలివితేటలు అధికంగా ఉంటాయి.. వీరి మనస్థత్వానికి.. టాలెంట్​ కు  స్టాక్ మార్కెట్​.. వడ్డీ వ్యాపారం.. బంగారం షాపులు వంటి వాటిలో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఇంకా వీళ్ల వాక్​ చాతుర్యానికి టెక్నికల్​ సపోర్ట్​.. మార్కెంటింగ్​...  కమ్యూనికేషన్​, మీడియా, ఐటీ, సేల్స్​ రంగాల్లో సక్సెస్​ అయ్యే అవకాశాలున్నాయి. 

కర్కాటక రాశి:  ఈ రాశి వారు చాలా ఎమోషనల్​ గా ఉంటారు.   సమస్యనైనా  సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు.  వీళ్లు టీచర్స్, సైకాలజిస్ట్,  డాక్టర్స్​,  సామాజిక సేవ, సోషల్ వర్కర్స్, గార్డెనర్స్ జాబ్స్ కి బాగా సూట్ అవుతారు.

సింహరాశి:  ఈ రాశి వారి జీవితం .. వీరి పర్సనాలిటిపై ఆధారంపడి ఉంటుంది.  వీరి చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి  వారికి  మంచి కెరీర్ ఉంటుంది. బాగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు. వీళ్లకు భయమంటే తెలియదు.  వీళ్లు కెరీర్ లో అలాగే డబ్బులు సంపాదిస్తారు.  సీఈవో, మేనేజర్స్,  రాజకీయం, క్రియేటివ్​ ఫీల్డ్​, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.

కన్యారాశి :  ఈ రాశి వారు చాలా లాజికల్​ గా ఉంటారు.  ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటారు. వీళ్లు ఎడిటింగ్, వ్రైటింగ్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్ జాబ్స్,  అకౌంటింగ్, IT సెక్టార్​ లో సెటిల్ అవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

తులారాశి:  ఈరాశి వారికి  ఎదుటి వ్యక్తుల ఆలోచనలను పసిగట్టే సత్తా ఉంటుంది.  అంటే వీరి తెలివి ఏ రేంజ్​ లో ఉంటుందో ఇక వేరే చెప్పనక్కరలేదు.  ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపిగ్గా వింటారు.  ఈ రాశి వారి కమ్యూనికేషన్​ స్కిల్స్​ జనాలను ఆకట్టుకుంటాయి. లాయర్​, పోలీస్​,  మీడియా,క్రియేటివ్ ఫీల్డ్స్ ,  బ్యాంకింగ్​ , పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఈ రాశి వారు బాగా రాణిస్తారు. 

వృశ్చిక రాశి :  ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచించి నిర్ణయ తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు.  చాలా నిజాయితీగా జీవిస్తారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ ,సైన్స్, డిటెక్టివ్ వృత్తి వంటి ప్రొఫిషన్​ను ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి:  ఈ రాశి వారు చాలా సైలెంట్ గా ఉంటారు. వీరికి ట్రావెలింగ్​ అంటే చాలా ఇష్టం. జీవితం గురించి తెలుసుకొనేందుకు ఆశక్తి చూపుతారు. ఎక్కువగా ఆధ్మాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు. ఈ రాశి వారి నిర్ణయాలు  ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటాయి.  కాబట్టి కోచింగులు ఇవ్వడం.. రాజకీయ రంగంలో.. ప్రొఫెసర్లుగా, ట్రావెల్​ రంగంలో  రాణిస్తారు.

మకర రాశి :  ఈ రాశి వారు  చాలెంజ్ లను ఇష్టపడతారు. అప్పుడే సంతోషంగా ఉంటారు. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారు. వీళ్లు కెరీర్ ఎంపికలో నిర్వహణ, వ్యాపారం, రాజకీయాలు ,ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.

కుంభరాశి: ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు.  తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం అలవాటుగా ఉంటుంది. చాలా క్యూరియాసిటీగా ఉంటారు.కాబట్టి వీళ్లు మంచి సైంటిస్ట్ లు, క్రియేటివ్​ రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించే  అవకాశాలున్నాయి. సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ,  ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.కాబట్టి వీళ్లు ఆర్టిస్ట్ లు .. వీరికి మంచి లైఫ్ ఉంటుంది. ఈ రాశి వారు సినీ రంగంలో .. డ్రామా ఆర్టిస్ట్, క్రియేటివ్ ఫీల్డ్స్, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవలకు సంబంధించిర రంగాల్లో  బాగా రాణిస్తారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.